Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత వెల్లడి
జెరూసలేం : సాధ్యమైనంత త్వరలో ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత యార్ లపిడ్ బుధవారం తెలిపారు. 120సీట్లు గల పార్లమెంట్లో 56మంది సభ్యుల మద్దతు పొందిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లపిడ్ను అధ్యక్షుడు కోరారు. మంగళవారం గడువు ముగిసేలోగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నెతన్యాహు విఫలమవడంతో తాజా చర్యలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి సంకీర్ణ భాగస్వాములతో లపిడ్ చర్చలు జరిపారు. ఐక్యతా ప్రభుత్వ ఏర్పాటు అనేది రాజీ పడడం కాదు, తమ లక్ష్యమని లపిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ''మేం పరస్పరం ఒకరినొకరం ద్వేషించుకోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.'' అని చెప్పారు. ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్ళను ఎదుర్కొనడానికి, వామపక్ష, మితవాద పక్షాలు కలిసి పనిచేయాలని అన్నారు. 28రోజుల్లోగా లపిడ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే 15ఏండ్ల నెతన్యాహు సుదీర్ఘ పాలనకు తెర పడుతుంది.