Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌ను కోరిన పాక్ కోర్టు
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగుల్లో సహకరించాలని పాక్ కోర్టు భారత్‌ను కోరింది. కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణశిక్ష కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారణ చేస్తోంది. ఈ బెంచ్‌లో చీఫ్ జస్టిస్ అత్తార్ మినావుల్లా, జస్టిస్ అమీర్ ఫరూక్ అబ్దుల్లా, జస్టిస్ మియాన్గుల్ హసన్ ఉన్నారు. కులభూషణ్‌కు న్యాయవాదిని నియమించాలని కోరుతూ పాక్ న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బుధవారం నాడు తిరిగి ప్రారంభించింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు అనుసారం తమ ప్రభుత్వం గతేడాది సిజె (సమీక్ష, పున్ణపరిశీలన) ఆర్డినెన్సు-2020ను తీసుకొచ్చిందని, తద్వారా చట్టబద్ధమైన పరిహారం పొందేందుకు జాదవ్‌కు అవకాశం ఏర్పడిందని తెలిపారు. భారత ప్రభుత్వం కోర్టు విచారణలో పాల్గొనేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందని, విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు న్యాయవాదిని నియమించుకునేం దుకు ముందుకు రావడం లేదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. జాదవ్ కేసులో అన్నివిధాలుగా సహకరించాలని భారత్‌ను కోరింది.