Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కోవిడ్ టీకాలపై మేథో సంపత్తి హక్కులను రద్దు చేయాలని పలు దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)కి ఒక ప్రతిపాదన సమర్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా బుధవారం ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలో 25 కోట్ల డోసులను ఉపయోగించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే వాల్‌స్ట్రీట్ ఎక్స్ఛేంజ్లో ఫైజర్, బయోఎన్‌టెక్, మోడర్నా, నొవాక్స్ వంటి ఔషధ కంపెనీల షేర్ల ధరలు తీవ్రంగా పడిపోయాయి. పేటెంట్ల రద్దు గురించి బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు. అమెరికా వ్యాక్సినేషన్ రేటు క్షీణించిన తర్వాత మాత్రమే ఆయన ఆ హామీ అమలుపై ఆలోచించారు. అమెరికాలోని కొన్ని వ్యాపార వర్గాలు, ఔషధ దిగ్గజాల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఆ చర్చ ముగిసిన తర్వాతే బైడెన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పేటెంట్లను తాత్కాలికంగా రద్దు చేయడాన్ని ఔషధ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని పేర్కొంటోంది. పైగా తక్కువ వ్యవధిలో పంపిణీ సమస్యలు కూడా పరిష్కారం కావని అన్నారు. యాంటీవైరల్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి సాంకేతికత చాలా అవసరమని, ప్రత్యేకమైన మార్గాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.