Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యవసరంగా ఆహారం అవసరమైన వారు దాదాపు 15.5కోట్ల మంది వున్నారని బుధవారం ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2019లో కన్నా 2020లో మరో 2కోట్ల మంది అదనంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది. ఆహార అభద్రతను తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాల్లో బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, యెమెన్లు వున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం పేర్కొంది. అక్కడ ఆయుధ ఘర్షణలు, క్షుద్భాద కలిసి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రధానంగా మానవతా సాయంపైనే ఆ ప్రాంతాలు ఆధారపడ్డాయి. పైగా, 2020లో అత్యంత తీవ్రమైన స్థాయిలో ఆహార అభద్రతను దాదాపు 13.3కోట్ల మంది ఎదుర్కొన్నారు. వీరికి అదనంగా గతేడాది 38దేశాల వ్యాప్తంగా 2.8కోట్ల మంది కరువుకు ఒక్క అడుగు దూరంలో వున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఘర్షణలు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులు వంటివి ఈ సమస్యలకు ప్రాధమిక కారణాలని అధ్యయనంలో వెల్లడైంది. అవి ఆహార అభద్రతను మరింత పెంచుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఆఫ్రికా అత్యంత దెబ్బతిన్న ప్రాంతం. 2020లో ఆహార సంక్షోభం పరంగా అధ్వాన్నమైన పదిదేశాల్లో హైతి, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లు వున్నాయి.