Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా స్కూల్లో రెండోసారి...
ఇడాహౌ : అమెరికాలోని ఇడాహౌలోని ఒక పాఠశాలలో ఆరో తరగతిచదివే అమ్మాయి అమాంతంగా కాల్పులు జరిపింది. ఇద్దరు పిల్లలకు తూటాలు తగలగా.. టీచర్ అప్రమత్తమై ఆ అమ్మాయి చేతిలోనుంచి తుపాకీ గుంజుకున్నది. దీంతో పెద్దప్రమాదం తప్పింది. కాల్పులు మోత వినగానే పిల్లలంతా భయాందోళనకు గురఅయ్యారు. యూఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 9.15 గంటల సమయంలో బాలిక తన పాఠశాల బ్యాగ్‌లోని హ్యాండ్ గన్ను తీసి పలు రౌండ్లు కాల్పులు జరిపింది. బాలిక చేతిలో నుంచి తుపాకీని లాగిన టీచర్, పోలీసులు వచ్చే వరకు బాలికను అదుపులో ఉంచారు. ఈ అమ్మాయి ఇడాహౌ ఫాల్స్ సిటీకి చెందినదిగా గుర్తించారు. ఆ బాలిక వద్ద తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.