Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు కళ్లెం వేసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన 'గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ పాండమిక్ రెస్పాన్స్' స్టీరింగ్ కమిటీలో ముగ్గురు భారత సంతతి ప్రముఖులకు చోటు దక్కింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచరు, డెలాయిట్ సీఈఓ పునిత్ రెంజన్, అడోబ్ సిఇఒ శంతను నారాయణ ఈ కమిటీలో గురువారం సభ్యులుగా నియమితులయ్యారు. ఈ చర్య కోవిడ్‌పై భారత్ విజయవంతంగా పోరాటానికి సహాయపడేందుకు కార్పొరేట్ సంస్థలు దోహదం చేస్తాయని పలువురు భావిస్తున్నారు. ఈ జాబితాలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్‌టేబుల్ అధ్యక్షుడు, సీఈఓ, యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సిఇఒ జోషువా బోల్టన్ కూడా సభ్యులుగా ఉన్నారు. గ్లోబల్ టాస్క్ ఫోర్స్‌ను యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రభుత్వ- ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు యూఎస్-భారత్ బిజినెస్ కౌన్సిల్, యూఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్స్‌తో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా అమెరికాలోని కార్పొరేట్ రంగం 25 వేలకు 8పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను భారత్‌కు ఇచ్చిన సంగతి విదితమే. డెలాయిట్ అందించిన తొలి వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు..రవాణా సంస్థ ఫెడెక్స్ సహకారంతో గత నెల 25న భారత్‌కు చేరుకున్నాయి. అదేవిధంగా వెంటిలేటర్లు కూడా వచ్చాయి.