Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో : స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఏకే -47 రైఫిల్‌తో పోల్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచ ప్రఖ్యాత కలాష్నికోవ్ రైఫిల్ మాదిరిగా, రష్యన్ వ్యాక్సిన్ నమ్మదగినదని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన టీకాపై స్పందనపై పుతిన్ ఈ ప్రకటన చేశారు. ఉప ప్రధాని టాట్యానా గోలికోవాతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు. సమావేశంలో అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ, 'మా ఔ షధం సాంకేతికత, దశాబ్దాలుగా ఉపయోగించిన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. టీకా కచ్చితంగా ఆధునికమైనది,నిల్వసామర్థ్యం ఉంటున్నది.ఇది నమ్మదగినది, సురక్షితమైనది. మేం ఈ మాట మాత్రమే కాదు, యూరోపియన్ స్పెషలిస్ట్ కూడా అదే మాట చెబుతున్నారు.. నేనూ భావిస్తున్నాను. అని పుతిన్ అభిప్రాయపడ్డారు.