Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్‌లో వరుసగా ఆరో ఏటా తగ్గిన జననాల రేటు
- 112 ఏండ్ల కంటే కనిష్టానికి..
న్యూయార్క్ : యూఎస్‌లో వరుసగా ఆరో ఏటా జనన రేటు పడిపోయింది. ఇది రికార్డు స్థాయిలో 112 సంవత్సరాలకు చేరుకుంది. ఇది 2019తో పోలిస్తే నాలుగు శాతం తగ్గింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జారీ చేసిన 99 శాతం ధ్రువీకరణ పత్రాల విశ్లేషణ ఆధారంగా దీన్ని తయారుచేశారు. 1979 తర్వాత ఇది అతిపెద్ద క్షీణత. జననరేటు తగ్గడానికి కారణం.. ఆందోళన, భయం, ఆర్థికస్థితి క్షీణించడం కూడా ప్రధాన కారణాలు. వైరస్ సమయంలో అమ్మో... బిడ్డలొద్దు.. కొన్నాళ్లు ఆగుదామన్న భావన మహిళల్లో వ్యక్తమవుతున్నది.
యూఎస్‌లో సంతానోత్పత్తి రేటు కొంతకాలం కిందట 2.1శాతంగా ఉండగా.. ఇపుడు 1.6 శాతానికి పడిపోయింది. ఇది గత పదేండ్ల నిరంతర క్షీణతగా నమోదైంది. సీడీసీ నివేదిక ప్రకారం.. గతేడాది యూఎస్‌లో సుమారు 3.6 మిలియన్ల (36లక్షల) పిల్లలు జన్మించారు. ఇది 2019లో సుమారు 38 లక్షలు. 2007లో ఈ సంఖ్య 4.3 మిలియన్లు(43లక్షలు). అమెరికాతో పాటు, అనేక యూరోపియన్ దేశాలు కూడా జనన రేట్ల క్షీణతను నమోదు చేశాయి. ఇటలీలో మొదటి లాక్డౌన్ సమయంలో జనన రేటు 22 శాతం తగ్గింది.