Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ అధినేత ఖొమైనీ వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇజ్రాయిల్ దాష్టీకాలపై ఇరాన్ అధినేత అలీ ఖొమైనీ ఘాటుగా స్పందించారు. ఇజ్రాయిల్ దేశమే కాదు, అదొక ఉగ్రవాద స్థావరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ప్రభుత్వ దుశ్యర్యలపై పాలస్తీనియన్లు ఐక్యంగా తిరగబడాలన్నారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాన్ని ఉగ్రవాద స్థావరంగా ఇజ్రాయిల్ మార్చేసిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ నిరంకుశ పొకడలపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పు జెరూసలెం, వెస్టు బ్యాంకు, గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్లంతా ఐక్యంగా పోరాడాలన్నారు. కొత్త రాజకీయ వ్యవస్థపై ఓటేసేందుకు పాలస్తీనియన్లు ప్రజాభిప్రాయ సేకరణకు డిమాంఢ్ చేయాలని ఖమేనీ సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్‌పై ఇజ్రాయిల్ సైబర్ దాడికి పాల్పడిందని ఇరాన్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.