Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లుథియానా: పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. కిల్లా రారుపూర్ గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగుచూడడంతో ప్రభుత్వం ఆ సుభ్ సింగ్ పౌల్ట్రీ ఫామ్‌కు సమీపాన 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఏరియాను ఇన్ఫెక్టెడ్ జోన్ కింద, 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని నిఘా (సర్వెలెన్స్) జోన్‌గా ప్రకటించింది. సుభ సింగ్ పౌల్ట్రీ ఫామ్‌ను ఎవియాన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్8) పాజిటివ్‌గా భోపాల్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ నిర్ధారించింది.