Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎడిన్‌బరో: స్కాట్లండ్ స్వాతంత్య్రం కోసం రిఫరెండమ్ నిర్వహించాలని స్కాటిష్ నేషనలిస్టు పార్టీ (ఎస్ఎన్పి) మరోసారి డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన స్కాట్లండ్ పార్లమెంటు ఎన్నికల్లో ఎస్ఎన్పి వరుసగా నాల్గవ సారి విజయం సాధించింది. మెజార్టీకి రెండు సీట్లు తగ్గినప్పటికీ ఎన్నికల ప్రచారంలో స్కాట్లండ్ స్వాతంత్య్రం గురించి ప్రధానంగా ప్రస్తావించామని, ప్రజలు ఇచ్చిన తీర్పు దీనికి అనుకూలంగానే ఉందని ఎస్ఎన్పి నాయకురాలు స్టర్జియిన్ అన్నారు. ఆదివారం నాడు ఆమె విజయోత్సవ ప్రసంగం చేస్తూ, స్కాట్లండ్ ప్రజల హక్కును అడ్డుకోవడానికి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గనుక యత్నిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 2014లో నిర్వహించిన రిఫరెండమ్‌లో 55-45 శాతం ఓట్ల తేడాతో స్వతంత్ర స్కాట్లండ్ డిమాండ్ వీగిపోయింది. 2021 ఎన్నికల ఫలితాలు కూడా ఈ డిమాండ్‌పై ప్రజల్లో చీలిక ఉన్నట్లు తెలియజేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.