Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూలు బయట పేలుళ్లు..
-60 మంది మృతి..150 మందికిపైగా గాయాలు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రాంతమైన కాబూల్లో మూడు చోట్ల బాంబు పేలుళ్లతో అట్టుడికింది. శనివారం జరిగిన ఈ పేలుళ్లలో.. మరణించిన వారి సంఖ్య 60 కి పెరిగింది. 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దాడి వెనుక తాలిబాన్ల హస్తం ఉండొచ్చని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆరోపించారు. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడిలో తమ ప్రమేయం ఉన్నదని ప్రకటించలేదు. తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ
ఈ పేలుళ్లు జరిగినపుడు పాఠశాలకు సెలవు ప్రకటించారు. అప్పుడే బాలికలంతా బయటకు వస్తుండగా... అంతకుముందు కారు పేలుడు జరిగిందని ఓ టీచర్ తెలిపారు. మరల రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ రెండు పేలుళ్లు రాకెట్ల ద్వారా పేలుళ్లు సృష్టించారనీ, స్కూలు బయట ఓ అనుమానితవ్యక్తి తచ్చాడుతూ..రాకెట్లాంఛర్తో దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు.
హైస్కూల్లో విద్యార్థి,విద్యార్థినీలకు మూడు షిప్టుల్లో క్లాసులు నడుస్తున్నాయని ఆఫ్ఘన్ విద్యాశాఖ ప్రతినిధి నజీబ్ ఏరియన్ తెలిపారు.రెండో షిప్టులో అమ్మాయిలు ఉన్నారనీ, ఈ దాడిలో ఎక్కువగా అమ్మాయిలు చనిపోయినట్టు తెలిపారు.