Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓలి విశ్వాస తీర్మానంపై నేడు ఓటింగ్
ఖాట్మండు : కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న భయంకర పరిస్థి తుల మధ్య నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి సోమవారం పార్లమెంటులో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 26 మంది ఎంపీలు కోవిడ్ బారిన పడ్డారు. ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చుకుంటున్నట్టు ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) ప్రకటించడంతో ఓలి ప్రభుత్వం మైనార్టీ లో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెల కొన్నది. ఇప్పటికే ఎంపీలకు పార్లమెంట్ అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారిన పడినట్టు పార్లమెంట్ కార్యదర్శి గోపాల్ నాధ్ యోగి తెలిపారు. ఓలి క్యాబినెట్లో నలుగురు మంత్రులకు కరోనా సోకింది. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఓలి నుంచి గట్టెక్కాలంటే కనీసం136మంది ఎంపీలమద్దతు అవసరం సీపీఎన్-యూఎంఎల్కు 121 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాని కెపి శర్మ ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15మంది ఎంపీల మద్దతు అవసరం.