Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్లో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సంక్షోభానికి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడమే దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికా టాప్ ప్రజారోగ్య నిపుణులు డా. అంధోనీ ఫౌచీ అన్నారు. కరోనా వైరస్ పోరులో దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చారు. ' కరోనాకు స్వస్తి పలకాలంటే..ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడమొక్కటే మార్గం. ప్రపంచంలో టీకాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం భారత్. ఆ దేశ వనరులను అది పెంపొందించుకోవాలి. కేవలం దేశీయంగానే కాకుండా ..భారత్ ఆవల నుండి కూడా' అని ఎబిసి న్యూస్ ఛాన్లకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. భారత్కు సరఫరా చేసేలా ఇతర దేశాలు తమ సొంత టీకాలు తయారు చేయడం, ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దానికి ఒకటే మార్గముందని, టీకాలు తయారు చేసే కంపెనీలను కలిగి ఉండాలని, దీని ద్వారా మిలియన్ డోసులు ఉత్పత్తి చేయగలగాలని పేర్కొన్నారు.
కరోనా కట్టడి చేయగలిగాలంటే గత ఏడాది చైనా అవలంభించిన విధానాలను భారత్ ఇప్పుడు అమలు చేయాలని సూచించారు. ఏడాది క్రితం చైనా నిర్మించినట్లుగా...భారత్ కూడా వెంటనే క్షేత్ర స్థాయి ఆసుపత్రులు (ఫీల్డ్ ఆసుపత్రులు) నిర్మించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. దీన్ని అమలు చేయాలని, ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోతే....కరోనా బాధితులను రోడ్డున పడేయలేరని, ప్రస్తుతం ప్రజలకు ఆక్సిజన్ దొరకని పరిస్థితులు రావడం శోఛనీయమని అన్నారు. భారత్లో బెడ్స్, ఆక్సిజన్, పిపిఇ కిట్ల కొరతతో పాటు ఇతర ఆరోగ్య పరికరాల సమస్య ఉందని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలున్నప్పుడు వీటిని ఎలా అధిగమిస్తారని, కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా నివారిస్తారన్న ప్రశ్నకు..ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ఆయన సూచించారు. కరోనా కట్టడి చేసే మార్గాల్లో వ్యాక్సిన్ ఒకటని, లాక్డౌన్ వంటి మార్గాలున్నాయని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి సూచనలే భారత్ చేశానని... ఆ దేశం కూడా అమలు చేసిందని అన్నారు. భారత్లోని పలు రాష్ట్రాలు కూడా లాక్డౌన్, కర్ఫ్యూలు వంటివి పెట్టాయని, అదే సమయంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని తెలిపారు. గత వారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఫీల్డ్ ఆసుపత్రులను నిర్మించాలని, సాయుధ దళాలతో పాటు ప్రభుత్వ మార్షల్స్ కరోనా పోరులో భాగస్వామ్యులను చేయాలని సూచించారు.