Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుకూలంగా 93, వ్యతిరేకంగా 124 ఓట్లు
ఖాట్మండు : నేపాల్ ప్రతినిధుల సభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని కెపి.శర్మ ఓలి ఓడిపో యారు. 275మంది సభ్యులున్న పార్ల మెంట్లో ఓలి అధికారాన్ని నిలబెట్టుకు నేందుకు 136మంది మద్దతు అవసరం కాగా, 93మంది మాత్రమే విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటేశారు. 124 మంది ఓలికి వ్యతిరేకంగా ఓటేశారు. నలుగురిపై సస్పెన్షన్ వేటు ఉండడంతో వారు విశ్వాస పరీక్ష తీర్మానంపై జరిగిన ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేకపోయారు. ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వంపై తన పట్టును పెంచుకోవాలనుకుంటున్న ఓలికి తాజా విశ్వాస పరీక్షలో ఓటమితో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ విశ్వాస పరీక్ష జరిగింది. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ గతేడాది డిసెంబర్ 20న భండారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇదే సమయంలో ప్రధాని ఓలి సిఫారసుల మేరకు అధ్యక్షురాలు కొత్త ఎన్నికల తేదీలను కూడా ప్రకటించారు.