Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 6.49లక్షల కేసులు..
- అమెరికాలో 25వేలకులోపే పాజిటివ్ నమోదు
వాషింగ్టన్ : ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా ముప్పుతో పోరాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 49 వేల 140 మందికి కరోనా సంక్రమించింది. 10,206 మంది చనిపోయారు. ఇక యూఎస్‌లో రోజూ వారీ కోవిడ్ సోకిన వారి సంఖ్య 25 వేలకు దిగువన ఉన్నది. అమెరికాలో 22,200 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది జూన్ 16 (26,530) తర్వాత ఈ సంఖ్య అతి తక్కువ కావటం విశేషం.
డబ్ల్యూహెచ్ఓ ఎమర్జన్సీటాస్క్ఫోర్స్
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర బ్రెజిల్, మెక్సికో, కొన్ని ఇతర దేశాల్లో ఆక్సిజన్ లేకపోవడం ప్రాణాంతకంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆక్సిజన్ కొరతపై అత్యవసర టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ సపోర్ట్ గ్రూప్ ప్రకారం.. గత రెండు నెలల్లో ప్రపంచంలో మెడికల్ ఆక్సిజన్ కొరతలేకుండా చూడాలని భావిస్తున్నది. దీని ప్రకారం ప్రతిరోజూ 90 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి మూడు రెట్లు (2కోట్ల 80 లక్షల క్యూబిక్ మీటర్లు)
పెరిగింది. ఆక్సిజన్ అవసరమైనంతగా అందుబాటులోలేదని గుర్తించింది. ఇందులో భారత్ నుంచి సగానికి పైగా ఉన్నది. భారత్ ఉన్న ఆక్సిజన్ కష్టాలు ఇతర దేశాల్లోనూ రావచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15.89 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 33.06 లక్షల మంది మరణించారు.
వేధిస్తున్న ఆక్సిజన్ కొరత
వైరస్ కోరలు విప్పటంతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా భారతదేశం, బ్రెజిల్, మెక్సికోతో సహా ప్రపంచంలోని పలు దేశాలలోఆక్సిజన్ కొరత వెంటాడుతున్నది. సకాలంలో ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోతున్న పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. చాలా పేద దేశాలకు వైద్య వినియోగానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావటంలేదు. పేద దేశాలు, మారుమూల ఉన్న చిన్నచిన్నదేశాల్లోని రోగులు, ఆస్పత్రులు ఆక్సిజన్ ట్యాంకర్లకు ఖరీదైన ప్రత్యామ్నాయాలపై ఆధారపడక తప్పటంలేదు.
సిలిండర్ సరఫరా పది రెట్లు ఎక్కువ
ధనిక దేశాల్లోని ఆసుపత్రులు ద్రవ ఆక్సిజన్ సరఫరా చేయడానికి ట్యాంకర్లపై ఆధారపడతాయి. వీటిని పెద్ద కంటైనర్లలో నిల్వ చేసి పైపుల ద్వారా ప్రతి మంచానికి రవాణా చేస్తారు. ఆక్సిజన్ సరఫరా యొక్క చౌకైన రూపం ఇది. చాలా కంపెనీలు పరిశ్రమల కంటే ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తున్నాయి. భారత్‌కు పంపుతున్న ఆక్సిజన్ ఆశించిన విధంగా ప్రణాళికబద్ధంగా సరఫరా చేయటంలో విఫలమవుతున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయు.