Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యా దేశంలోని ఖజాన్ పట్టణంలోని స్కూలులో జరిగిన కాల్పులలో పదమూడు మంది చనిపోయారు. అందులో ఆరుగురు విద్యార్థులే ఉన్నారు. పోలీసులు ఆ స్కూలు భవనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఖజాన పట్టణంలో 175 స్కూలు నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ కాల్పులకు కారణం ఒక యువకుడు అని తేలింది. కాల్పులలో ఒక ఉపాధ్యాయుడు కూడా మృతి చెందినట్టు తెలుస్తున్నది. ఆ స్కూలులోనే బాంబు విస్ఫోటనం జరిగి స్కూలులో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.