Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ అధ్యయనంలో వెల్లడి
జకార్తా : చైనాకు చెందిన సినొవాక్ వ్యాక్సిన్ భేషుగ్గా ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ రోగుల మరణాలను నివారించడంలో 98శాతం, ఆస్పత్రిపాలవ కుండా నివారించడంలో 96శాతం మేర ఇది ఫలితమిస్తోందని ఇండొనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. జకార్తాలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సినొవాక్ వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి సేకరించిన డేటాపై ప్రాథమిక అధ్యయనం జరిపారు. ఆ అధ్యయనంలో పై విషయాలు వెల్లడయ్యా యని ప్రముఖ పరిశోధకుడు, ఆరోగ్య అధికారి పాండ్జి దేవన్వ్రత బుధవారం తెలిపారు.