Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోస్నియాలో వందలాది హత్యలకు బాధ్యుడు
- ఇంటర్పోల్ అరెస్టు..కోర్టుకేసుల తర్వాత నిర్ణయం
సారజేవో: బోస్నియా కటికోడు 'రాడోవాన్' బ్రిటన్ జైళ్లో మిగిలిన శిక్షను అనుభవిం చనున్నాడు.. బోస్నియాలో వందలాది మంది హత్యలకు, మారణకాండకు బాధ్యుడు అని కోర్టు నిర్థారించి ఆయనకు శిక్ష వేసింది. అయితే ఖైదీల మార్పిడి ఒప్పందం ప్రకారం ఆయన బోస్నియాలో కాకుండా ... మిగతా జైలు జీవితాన్ని ఇంగ్లాండ్లో గడపనున్నారు. ఇంటర్పోల్ ద్వారా ఆయనను అరెస్టు చేశాక.. కోర్టులో కేసు నడపడం ప్రస్తుతం ఆయనను తమ దేశంలోని జైలులో ఉంచడానికి ఇంగ్లాండ్ క్రియాశీలంగా వ్యవరించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధ నేరాల గురించి జరిగిన కోర్టు విచారణలో ఇది చాలా ముఖ్యమైన కేసుగా భావిస్తుంటారు.