Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8గంటల ఆందోళన తరువాత
- ఇరువురు భారతీయుల విడుదల
- వెల్లివిరిసిన సంఘీభావం
లండన్ : ఇమ్మిగ్రేషన్ నేరాలకు పాల్పడ్డారన్న అనుమానంతో నిర్బంధించిన ఇద్దరు ప్రవాస భారతీయులకు సంఘీభావంగా పలువురు ఆందోళనకు దిగారు. పోలీసుల చర్యకు నిరసనగా ఎనిమిది గంటలసేపు ఆందోళన నిర్వహించారు. చివరికి మానవ హక్కుల లాయర్ జోక్యంతో వారిని విడుదల చేశారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో చెఫ్‌గా పనిచేస్తున్న సుమిత్ సహదేవ్, మెకానిక్ లఖ్విర్సింగ్ గత పదేళ్లుగా లండన్‌లో వుంటున్నారు. గురువారం నాడు ఆరుగురు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, స్కాట్లాండ్ పోలీసులు కలిసి వారి ఇంటికి వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్ళి వ్యాన్‌లో కూర్చోబెట్టారు.వారిని నిర్బంధ శిబిరానికి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. ఈలోగా ఆ ఇంటి చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో పోగై పోలీసుల చర్యను నిరసించారు. ఆ ఇద్దరిని విడుదలజేయాలని ఎనిమిది గంటల పాటు ఆందోళన చేశారు. పాకిస్తాన్‌కి చెందిన మానవ హక్కుల లాయర్ అమర్ అన్వర్ జోక్యంతో చివరికి ఆ ఇద్దరిని పోలీసులు విడిచిపెట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం పైగా ఈద్ రోజున చేయడం రెచ్చగొట్టే చర్య అని అన్వర్ విమర్శించారు.