Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రపంచంలో మొదటిసారి అమెరికాలో 12-15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించారు. ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో ప్రారంభం అయింది. రెండో వైపు అమెరికాలో రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించనవసరం లేదని, భౌతికదూరం పాటించాల్సిన పని లేదని సీడీసీ ప్రకటించింది. అమెరికాలో 15.4 కోట్ల మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో 11.75 కోట్ల మంది రెండో డోస్ కూడా పూర్తి అయింది. ' వైద్య శాస్త్రం ప్రకారం వ్యాక్సినేషన్ పూర్తయితే పూర్తి రక్షణ ఏర్పడినట్టేనని, కరోనా మొదలైనప్పుడు ఏ పనులు నిలిపివేశారో వాటిని ఇప్పుడు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు'' అని సెంటర్ ఫర్ డీసీబీ కంట్రోల్ అండ్ ప్రీవెంషన్ (సీడీపీ) తెలిపింది. అయితే దానితోపాటే కొన్ని జాగ్రత్తలు కూడా తెలియజేసింది. విమానం, రైలు బస్సులలో ప్రయాణం చేసినా ఇది వర్తించదు. ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా వర్తించదు.