Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్: నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ పునర్ నియమించబడ్డారు. ప్రతిపక్ష పార్టీల మధ్య విబేధాల వల్ల అవి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక అంగీకారానికి రాలేకపోయాయి. నేపాలీ కాగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ సీపీయన్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా అది విఫలం అయింది. దానితో నేపాల్ పార్లమెంట్లో ఏకైక పెద్ద పార్టీ హోదాలో ఓలీని మళ్లీ ప్రధానిగా ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీ నియమించారు. ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ శర్మ ఓలీ సీపీయన్ (యుఎంఎల్) పార్టీకి చైర్మెన్‌గా ఉన్నారు. పదవీ స్వీకరించిన 30 రోజుల్లో ఓలీ విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.