Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దళితులు
వాషింగ్టన్ : '' దినసరి కూలీగా గంటకు 1.20 డాలర్ వేతనంగా ఇస్తున్నారు. మా శ్రమను దోచుకుంటున్నారు. ఇక్కడి (న్యూజెర్సీ, అమెరికా) లేబర్ చట్టాల ప్రకారం వేతనం ఇవ్వటం లేదు'' అని అమెరికాలో 200మందికిపైగా దళితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యూజెర్సీలోని ఒక దేవాలయ నిర్మాణ పనుల నిమిత్తం భారత్ నుంచి వందలాది మంది దళితుల్ని రప్పించి, కార్మికులుగా నియమించుకున్నారు. వారికి గంటకు 1.20 డాలర్ల చొప్పున నెలకు వేతనంగా 450 డాలర్లను (సుమారుగా రూ.32వేలు) అందజ ేస్తున్నారు. అమెరికా కార్మికచట్టాల ప్రకారం, న్యూజెర్సీలో ఒక కార్మికుడికి కనీస వేతనంగా గంటకు 12 డాలర్లు అందజేయాలి. అంతే గాక తమను భయపెడుతూ, బెదిరిస్తూ బలవంతంగా తక్కువ వేతనా లకు పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నారని దళితులు కోర్టును ఆశ్రయించారు.