Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా: కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో భారత్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందనీ, కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులతో పాటు మరణాలు సైతం నిత్యం రికార్డు స్థాయిలో నమోదుకావడంతో పరిస్థితులు మరింత ప్రమాదకంరగా మారుతున్నాయంది. కరోనా వెలుగుచూసిన గతేడాది (2020) కంటే ఈ ఏడాది పరిస్థితులు చాలా దారుణంగా ఉండనున్నాయని పేర్కొంది.డబ్ల్యూహెచ్వో ఛీప్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్కు తాము కావాల్సిన సాయం అందిస్తున్నామని తెలిపారు.