Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : అంగారక యాత్రలో చైనా ఘనత సాధించింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తియాన్వెన్-1 ప్రయోగం విజయవంతమైంది. తొలి ప్రయత్నంలో విజయం సాధించడం గమనార్హం. చైనా మానవరహిత అంతరిక్ష నౌక తియాన్వెన్-1 తీసుకెళ్లిన మార్స్ రోవర్ (జురోంగ్ రోవర్) ...అరుణ గ్రహాన్ని తాకినట్లు చైనా అంతరిక్ష సంస్థ (సిఎన్ఎస్ఎ) శనివారం ధ్రువీకరించింది. జురోంగ్ రోవర్‌ను పారచూట్ సాయంతో మార్స్‌పై ల్యాండర్ సాఫీగా దిపిందని, అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ నిరాటకంగా సాగిందని చెప్పింది. ల్యాండింగ్‌లో కీలకమైన చివరి ఏడు నిమిషాలు ప్రక్రియ సజావుగా సాగిందని, అరుణ గ్రహంపై విస్తారమైన మైదాన ప్రాంతంలో రోవర్‌ను దింపినట్లు తెలిపింది. కాగా, ఈ కార్యక్రమాన్ని నిహావ్ మార్స్ పేరిట ప్రత్యక్ష ప్రసారం చేసింది. తియాన్వెన్-1 ల్యాండర్, రోవర్‌ను జులై 23, 2020న ప్రయోగించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగార కక్షలోకి ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఇప్పటి వరకు అంగారకుడిపై రోవర్లను అమెరికా, రష్యాలు మాత్రమే పంపగా, ఇప్పుడు వాటి సరసన చైనా చేరింది. దాదాపు 240 కిలోల బరువున్న ఈ రోవర్...సోలార్ విద్యుత్ సాయంతో పనిచేస్తుంది. ఈ రోవర్ అంగారకుడి ఉపరితలంపై శిలాజాలు, పలు నమూనాలు సేకరించనుంది