Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అమెరికాలో న్యూజెర్సీ కాలిఫోర్నియాలో భారత దళిత ఉద్యోగులు కుల వివక్షకు గురి అవుతున్న సంఘటనలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. 'సిస్కో' అనే బహుళజాతి కంపెనీలో జరుగుతున్న వివక్షపై అక్కడి కోర్టులో ఉద్యోగులు కేసు దాఖలు చేశారు. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం దళిత హక్కుల సంస్థలు అమెరికాలో పని ప్రదేశాలలో జరుగుతున్న వివక్షపై పోరాడుతున్నాయి. అక్కడ తక్కువ జీతాలు, ఎక్కువ గంటలు పని చేయించు కోవడం, అవకాశాలు నిరాకరించడం, దళితులు అని తెలిస్తే దాడులు చేయడం అవమానించడం లాంటి రూపాలలో వివక్ష వ్యక్తం అవుతున్నది. న్యూజెర్సీలో బోచ్చసానస్వాలీ శ్రీ అక్షర పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో హిందు మందిర నిర్మాణం కోసం భారత దేశం నుంచి 200మంది దళిత కార్మికులను తీసుకువెళ్ళారు. వారితో ఎక్కువ గంటలు పని చేయించుకోవడం ఆ రాష్ట్రలో చట్ట ప్రకారం ఇవ్వాల్సిన కనీస వేతనంలో పదోవంతు మాత్రమే ఇవ్వడం జరుగుతు న్నది. ఆ దళిత కార్మికులను అమెరికాలో తీసుకువెళుతున్నప్పుడు వారు వాలంటీర్లని ప్రభుత్వ డ్యాకుమెంట్లో తప్పుడు సమాచారంతో తీసుకువెళ్ళడంతో కార్మికులకు చట్ట ప్రకారం ఉండే కొన్ని రక్షణలు నిరాకరించబడుతున్నాయి. సిస్కో అనేది సాప్ట్వేర్ రంగంలో బహుళజాతి గల సంస్థ. దానిలో వివక్షతపై సమాచారం బయటపడటంతో అప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో వివక్షత లేదని జరుగుతున్న ప్రచారం డొల్లతనం బట్ట బయలు అయింది. అక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగులు మట్లాడుతూ భారత్లో జరుగుతున్న వివక్షను తప్పించుకోవడానికి అమెరికా వెళ్ళితే అక్కడ కూడా ఉండటంతో నిరాశ చెందామని చెప్పుకువచ్చారు. పనిలో ప్రావీణ్యతలో మేం ఇతరులకు తీసిపోం కాని దళితులమనే ఒకే ఒక కారణంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, సిస్కోలలో పని చేస్తున్న దళిత మహిళా ఉద్యోగులు వారు ఎదుర్కొంటు న్న వివక్షతను గురించి వాషింగ్టన్ పోస్టుకు తెలియజేశారు. భారతదేశం లో ఉన్న కుల వివక్షత అమెరికాలో తెలియదు కాబట్టి కంపెనీలు వారి అధికారులకు వాటి మీద అవగాహన కల్పించి, వివక్షతకు పాల్పడకుండా శిక్షణ ఇవ్వాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.