Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 అంతస్థుల అల్ జజీరా కార్యాలయం కూల్చివేత
గాజా: గాజాలో పదకొండు అంతస్తు అల్ జజీరా భవనాన్ని ఇజ్రాయిల్ వైమానిక దాడిలో కూల్చివేసింది. భవనంలో ప్రజలు నివసించే అపార్టు మెంట్లు, ఆఫీసులు ఉన్నాయి. అందులోనే అల్ జజీరా అసోసియేట్ ప్రెస్లాంటి ప్రసార సాధనాలు ఆఫీసులు కూడా ఉన్నాయి. ప్రత్యేక లక్ష్యంగా చేసుకొని ఈదాడి జరిగినట్టు తెలుస్తుంది. దాడి జరగడానికి గంట ముందు టెలిఫోన్ ద్వారా సమాచారం అందడంతో ఆ భవనంలోని వారి హుటా హుటిగా భవనాన్ని ఖాళీచేశారు. ఇజ్రాయిల్ చేసిన దాడిని సమర్థించుకుంటూ ఈ భవనంలో హమాస్ సైనిక గూఢాచర్యలకు కేంద్రమంటూ.. సాకు చెప్పి ఏ భవనంపై దాడి చేసినా ఇదే కారణమని ఇజ్రాయిల్ చెబుతున్నది. గత ఏడు రోజుల నుంచి గాజాపై ఇజ్రాయిల్ ముమ్ముర వైమానిక దాడులు చేస్తున్నది. ఇప్పటి వరకు 145 మంది చనిపోయినట్టు సమాచారం. పాలస్తీనీయన్లకు మద్దతుగా అమెరికా నగరాలలో జరిగే ప్రదర్శనలు జరుగుతున్నా లాస్ ఎంజిల్స్, న్యూయార్క్, బోస్టన్ ఫిలాడలఫియాతో పాటు ఇతర నగరాలలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
పాలస్తినాకు సంఘీభావంగా అమెరికాలో ప్రదర్శనలు
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న వైమానిక దాడులను వెంటనే ఆపాలని నిరసనకా రులు కోరుతున్నారు. పాలస్తీ నాకు స్వేచ్ఛ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ పౌరుల జీవితం విలువ పాలస్తీనా పౌరుడి విలువ సమానంగా ఉండాలి అని కోరుతున్నాను. ఇజ్రాయిల్ అణుబాంబు ఉన్న దేశం. పాలస్తీనా బండలు గుట్టలతో కూడిన గ్రామీణ ప్రాంతంలో నిండినది. ఈ స్థితిలో ఎవరు దాడులు చేస్తారు అని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయిల్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ బలపర్చడం ఆపివేయాలని కోరుతున్నారు. బాధితులను బలపర్చటం, దాడులు చేసేవారిని కాదు అని డిమాండ్ చేస్తున్నారు.