Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంపూర్తిగా ముగిసిన భద్రతా మండలి సమావేశం
న్యూయార్క్ : పాలస్తీనా-ఇజ్రాయిల్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక ఒప్పందానికి రాకుండా అమెరికా మోకాలడ్డింది. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న ఉగ్ర దాడులు రెండో వారంలో ప్రవేశించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించేందుకు చైనా అధ్యక్షతన ఆదివారం ఆన్లైన్లో జరిగిన ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం ఒక ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించింది. 15 మంది సభ్యులు గల భద్రతామండలిలో దాదాపు అన్ని దేశాలు సానుకూలంగా స్పందించాయి. అమెరికా ఒక్కటే దీనిని వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే సమావేశం ముగిసింది. గాజాలో నివసిస్తున్న 20లక్షల మంది పాలస్తీనియన్లపై గత వారం రోజులుగా ఇజ్రాయిల్ ఆర్మీ సాగిస్తున్న హింసపైనే ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. అర్ధరహితమైన ఈ రక్తపాతం, భయానక వాతావరణం, విధ్వంసక చర్యలను తక్షణమే ఆపు చేయాల్సిందేనని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. ఇజ్రాయిల్ చర్యల ను ఊచకోతగా ఆయన అభివర్ణించారు. ఇజ్రాయిల్ చర్యలు అంతర్జాతీయ చట్టా లను ఉల్లంఘిస్తున్నాయని భద్రతా మండలిలో 99 శాతం మంది సభ్యులు అంగీక రించారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ విచక్షణారహితంగా జరిపిన దాడులు 188 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలే.