Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో
- కుదరని ఏకాభిప్రాయం.
గాజా: ఆదివారం నాడు ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 42 మంది పాలస్తీనీయన్లు మృతి చెందినట్టు తెలుస్తున్నది. గాజా నగరంలోని చాలా భావనాలను ఈ దాడులలో నేల మట్టం చేశారు. ఈ దాడుల ఉధృతి తీవ్రంగా..విస్తృత ప్రాంతంపై ఎక్కువ సేపు జరిగినట్టు తెలుస్తున్నది. ఇజ్రాయిల్ ఆపధర్మ ముఖ్యమంత్రి బెంజమిన్ నేతన్యాహు బరితెగించి ఈ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. ఒక పాలస్తీనా పౌరుడు ఇందులో గాయపడ్డాడు. గత వారం మొదలైన వైమానిక దాడులలో ఇప్పటి వరకు దాదాపు 192 మంది మృతి చెందారు. అందులో 58 మంది పిల్లలు, 34 మంది మహిళలు ఉన్నారు. ప్రతి మూడు గంటలకు ఒక పిల్లవాడు చనిపోతున్నాడు. గాజా భూబాగాన్ని పాలిస్తున్న హమాస్ ఇజ్రాయిల్‌పై ప్రతికారంతో రాకెట్లతో దాడులు చేస్తున్నది. ఇజ్రాయిల్ నగరాలైన ఆస్కకిలాన్, బీరషీబాపై కేంద్రీకరించి ఈ దాడులు జరిపారు. అందులో 10 మంది చనిపోయారు. ఆదివారం నాడు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఈ హింసాత్మక సంఘటనపై చర్చించినా ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. ఉమ్మడి ప్రకటన ఇవ్వడానికి కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా అడ్డు పడటంతో ఏకాభిప్రాయం కుదరలేదని చైనా అభిప్రాయపడింది. ఇజ్రాయిల్ దాడిలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో గాజానగరంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ లేదు. గాజా విద్యుత్ సరఫరా సంస్థ విద్యుత్ తీగల మరమత్తు వేగంగా జరుగుతున్నట్టు తెలిపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. కెనడా దేశంలోని మాంటియల్ పట్టణంలో ఇటు ఇజ్రాయిల్ అటు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిగి వారు తలపడ్డారు. ఆ దేశ ప్రధాన మంత్రి ఘర్షణలు పడటం సరికాదని తీవ్ర పదజాలంతో దూషించుకోవడం మానుకోవాలనీ, ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయాలు చెప్పుకునే సేచ్ఛ ఉన్నదని చెప్పారు.