Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తైపీ: తైవాన్లో ఆదివారం నాడు 207 కొత్త కరానా కేసులు నమోదు అయ్యాయి. ఆదేశంలో మహహ్మారిని గుర్తించిన నాటి నుంచి ఒక రోజులో నమోదు అయిన కేసుల్లో ఇది ఎక్కువ అని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. మొదటి దశలో కరోనా వ్యాప్తిని ఆ దేశం సమర్థవంతంగా అరికట్టింది. వరుసగా 250 రోజులు ఒక కేసు కూడా లేకుండా ఆ ప్రభుత్వం కట్టడి చేయకల్గింది. ఇప్పుడు తైవాన్లో 1,682 కేసులు నమోదు అయి అందులో 12 మంది చనిపోయారు. గత అనుభవంతో ఈ సారి పెరుగుతున్న కేసులను గుర్తించి ఎక్కడ నుంచి వస్తున్నాయో అన్వేషించి, అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చురుకుగా అడుగులు వేస్తున్నది.