Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగపూర్: పిల్లల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్ వ్యాపిస్తున్న కారణంగా బుధవారం నుంచి సింగపూర్లో స్కూళ్ళు, కాలేజీలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులంతా ఇండ్ల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో ఇన్ని నెలలుగా అసలు జీరో కేసులే ఉండగా ఇటీవల కేసులు పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేయనుంది. ఈ నెల 28న ప్రైమరీ, సెకండరీ స్కూళ్ళు, జూనియర్ కళాశాలలను మూసివేస్తామని, విద్యార్థులు ఇక ఇండ్లకే పరిమితమై పాఠాలు నేర్చుకోవాలని అధికారులు వెల్లడించారు.