Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైపితె: మయన్మార్ దేశంలో చిన్ రాష్ట్రంపై సైనిక పాలకులు గురి పెట్టి తీవ్రమైన దాడులకు పూనుకుంటున్నారు. దానితో ఆగమ్యగోచరమైన పరిస్థితి నెలకొన్నది. పురుషులను అరెస్టులు చేస్తుండటంతో విపత్తు ఏర్పడింది. ఇళ్ళల్లో ఆడవాళ్ళను, పిల్లలను వదిలి వేసి పురుషులు అడవులకు పారిపోయి తల దాచుకుంటున్నారు. దానితో అభద్రత, భయం అన్ని దిక్కులా వ్యాపించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, కెనడా, ఇంగ్లండ్ మయన్మార్‌పై సరికొత్త ఆంక్షలను విధించాయి. గతంలో కొన్ని కఠిన నిబంధనలను అమలు జరిపిన ఈ దేశాలు మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఆంక్షలకు పాల్పడుతున్నాయి. మయాన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధణ, సైనిక పాలన అంతం కోసం పోరాడుతున్న ప్రజలకు తమ మద్దతును తెలిపాయి. మయన్మార్‌తో ఆర్థిక లావాదేవీలు నిలిపివేశారు. రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నారు. ఫిభ్రవరి ఒకటిన సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేపట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు-