Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోండని ఇజ్రాయిల్ ఆపదర్మ ప్రధాని నెతన్యా హుకు ఫోన్ సంభషణలో చెప్పారు. డెమోక్రటిక్ పార్టీలోని వాళ్ళు కూడా కాల్పుల విరమణనను కోరుకుంటున్నారు. బైడెన్ కొంత కాలంగా ఇజ్రాయిల్‌ను బలపర్చడాన్ని తప్పు పడుతున్నా దానితో బైడెన్ కాల్పుల విరమణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే అదే సందర్భంలో ఇజ్రాయిల్ తనపై విచక్షణారహితంగా జరుగుతున్న దాడుల నుండి ఆత్మ రక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెపుతున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని మాత్రం పూర్తి స్థాయిలో దాడులు చేయడం తప్పదని చెపుతున్నారు. మే 10 నుంచి జరుగుతున్న దాడులలో ఇప్పటి వరకు 212 మంది చనిపోయారు. అందులో 61 మంది పిల్లలు ఉన్నారు. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళి పోతున్నారు. అమెరికా సైనిక జనరల్ మార్క్ మల్లి దాడులు కొనసాగితే మరింత అనిచ్చిత పరిస్థితులు ఏర్పడుతాయిని అది గాజాకి నష్టం అని ఏ ఒక్కరికి దీని ప్రయోజనం ఉండదని చెప్పారు. అందుకోసం ఆయన నాటో సభ్యులతో చర్చించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాడులను తగ్గించుకోవడమే అందరికి మేలని ఆయన అభిప్రాయపడ్డారు. జోర్డాన్ రాజు అబ్థుల్లా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు ఫోన్ చేసి అంతర్జా తీయ సమాజం ఈ దశలో జోక్యం చేసుకుని దాడులను వెంటనే ఆపించాలని కోరారు. ఫోప్ మాట్లాడుతూ ఈ వైమానిక దాడులలో పిల్లలు పెద్ద ఎత్తున చనిపోవడంపై తన విచారాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను చంపడం అంటే భవిష్యత్‌ను చిదిమి వేయడం అని అన్నారు. అందుకని ఈ దారుణ దాడులను వెంటనే నిలిపి వేయాలని కోరారు.