Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్ ఆక్రమణలకు నిరసనగా
జెరూసలేం : గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణ కొనసాగుతున్నందుకు నిరసనగా మంగళవారం పాలస్తీనియన్లు సార్వత్రిక సమ్మె నిర్వహించారు. అన్ని ఆక్రమిత ప్రాంతాల్లో, ఇజ్రాయిల్‌లో పాలస్తీనియన్లందరూ కార్యాచరణ దినంగా పాటించారు. రోజంతా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. సోషల్ మీడియాలో పాలస్తీనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపిచ్చారు. ఈ పిలుపునకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ గ్రూపులు, సంఘాలు మద్దతిచ్చాయి. పాలస్తీనియన్ల సమ్మెకు సంఘీభావంగా కార్యాచరణ పాటించాల్సిందిగా పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పిలుపిచ్చాయి. ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లు కూడా మద్దతిచ్చారు. ఆక్రమిత తూర్పు జెరూసలేంలో షేక్ జారా నివాసులను ఖాళీ చేయించడానికి ఇజ్రాయిల్ చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా, అల్ అక్సా మసీదుపై దాడులను ఖండిస్తూ ఈ సమ్మె చేపట్టారు. జెరూసలేంలోని హైఫా నుండి నబ్లస్ వరకు పలు నగరాలు, పట్టణాల్లో వేలాదిమంది ప్రజలుల వీధుల్లోకొచ్చి ఇజ్రాయిల్ నేరాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
బైడెన్‌కు మిచిగాన్‌లో పాలస్తీనా నిరసన సెగలు
మిచిగాన్ నగరంలోని విద్యుత్ విహనాల కంపెనీని బైడెన్ సందర్శించారు. ఆ సందర్భంలో పాలస్తీనా మద్దతుదారులు అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బైడెన్ విధానాలు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా ఉండాడాన్ని వారు ఖండించారు.ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తూ ద్వంసం చేస్తుంటే దానిని బలపర్చడం అంటే పాలస్తీనీయులను చంపడాన్ని బైడెన్ సమర్థిస్తున్నాడని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బైడెన్ తన విధానాలను వెంటనే మార్చుకుని అక్కడ శాంతిని స్థాపించాలని కోరారు. అటు తరువాత అరబ్ అమెరికన్లు అధికంగా నివసించే డియర్బార్న నగరంలోని ఫోర్డ్ కంపెనీని సందర్శించారు. అక్కడ పాలస్తీనాలో జరుగుతున్న హింస పై ఒక ప్రశ్నని అడగటానికి ప్రయత్నించిన మహిళా విలేకరిని ఆయన వారించారు. అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నుంచి లాఫేర్ ఫార్క్ వద్ద 1000 మంది పాలస్తీనా మద్దతు దారులు ప్రదర్శన నిర్వహించి బైడెన్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. అక్కడ జరుగుతున్న జాతి వివక్ష దాన్ని ఆయన బలపరుస్తూ... పాలస్తీనీయన్ల హత్యకు నిధులు సమకూరుస్తున్నారని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
గాజాలో సొరంగ మార్గాలను ధ్వంసం చేసిన ఇజ్రాయిల్
గాజాపై జరుగుతున్న వరుస దాడులలో భాగంగా గాజాలోని 15 కిమి ్ల వాడే సొరంగ మార్గాని ఇజ్రాయిల్ వేసిన బాంబులతో పూర్తిగా ధ్వంసం అయినాయి. ఈ దాడులలో రోడు, మౌళిక సదుపాయాలకు కూడా బారీ నష్టం వాటిల్లింది. గాజాలో ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంకు ఈ దాడుల వలన తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ కేంద్రానికి ఇంధనం సరఫరా నిల్చిపోయే పరిస్థితలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇంధనం మూడు రోజులకు సరిపడ మాత్రమే ఉన్నది. ప్లాండులోని యంత్రాలకు వాడే విడిబాగాలు కొరత కూడా ముందుకు వస్తున్నది. దాడులు కొనసాగితే గాజా నగరం పూర్తిగా చీకటి నగరం అయ్యే పరిస్థితలు దగ్గరలోనే ఉన్నాయి. ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులలో హమాస్ కీలక నేత చనిపోయారు. ఆయన ఇజ్రాయిల్‌పై జరిగిన రాకెట్ దాడులకు వ్యూహకర్త అని తెలుస్తున్నది. గాజాలో తన ఇంట్లో ఉన్న జర్నలిస్టు యుసూప్ అబు హుసేన్ ఇజ్రాయిల్ జరిపిన మిసైల్ దాడిలో మృతి చెందారు.
దేశాలకు మనమే వ్యాక్సిన్ సరఫరా చేసి, అక్కట అరికట్టితే మనకి మంచిదని బైడెన్ అభిప్రాయ పడ్డారు. జూన్ చివరి నాటికి 80 మిలియన్ల వ్యాక్సిన్లు ఇతర దేశాలకు అంద చేస్తాం. ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యాక్సిన్లు రష్యా, చైనా ఇతర దేశాలు ఇచ్చాయి. వాటికి మించి జూన్ చివరి వరకు అమెరికా ఇస్తుందని సెలవిచ్చారు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టిన కేసులు.