Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాలోని ఓ అణు విద్యుత్ ప్లాంట్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్
- పుతిన్ ఆన్లైన్ భేటీలో నిర్ణయం
బీజింగ్: అణు ఇంధన రంగంలో సహకారం విషయంలో రష్యా-చైనా పెద్ద ముందడుగు వేశాయి. బుధవారం ఈ ఇరు దేశాల అధినేతలు సీ జిన్పింగ్, పుతిన్ మధ్య జరిగిన ఆన్లైన్ చర్చల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి అంగీకారం కుదిరింది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం మూడో తరానికి చెందిన నాలుగు అధునాతన అణు రియాక్టర్లను రష్యా చైనాకు సరఫరా చేయనున్నది. అణు ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన అతి పెద్ద ఒప్పందం ఇదే. రష్యా అందించే నాలుగు రియాక్టర్లలో రెండింటిని తూర్పు చైనాలోని జియాంగ్ ప్రావిన్స్ తైన్వాన్ వద్ద నెలకొల్పనున్నారు.