Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో తొమ్మిది మంది..
- కరోనాతో ఫార్మాకంపెనీలకు కాసుల వర్షం..: ఫోర్బ్స్ రిచ్లిస్ట్లో వెల్లడి- న్యూయార్క్: కరోనా వైరస్ అనేక మంది ఆర్థిక పరిస్థితులను ఛిద్రం చేయగా.. ఓ తొమ్మిది మందిని మాత్రం కుబేరులుగా మార్చింది. కోవిడ్ వైరస్ ఫార్మాకంపెనీలకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. తాజాగా కరోనాకు వ్యాక్సిన్లు తయారు చేసే తొమ్మిది మంది పారిశ్రామికవేత్తలు ప్రపంచ అపర కుభేరుల జాబితాలో చేరారని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ అనే కాంపెయిన్ గ్రూప్ తెలిపింది. మోడెర్నా సంస్థ సీఈఓ స్టీఫెన్ బాన్సెల్, బయో ఎన్టెక్ వ్యవస్థాపకుడు ఉగర్ సహిన్ ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నారు. అలాగే చైనా వ్యాక్సిన్ కంపెనీ కాన్సిన్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో కొత్తగా చేరిన తొమ్మిది మంది నికర సంపద విలువ 19.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.50 లక్షల కోట్లు) అని ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ అంచనా వేసింది. అదే విధంగా ఇప్పటికే బిలియనీర్ల జాబితాలో ఉన్న మరో 8 మంది సంపద టీకాలు వచ్చిన తర్వాత 32.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.40 లక్షల కోట్లు) పెరిగింది. కొత్తగా చేరిన కుబేరుల మొత్తం సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలందరికీ 1.3 రెట్ల టీకాలు అందించొచ్చని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ సూచించింది. టీకాలతో ఫార్మా కంపెనీలు భారీ లాభాలను సాధించాయని చెప్పేందుకు ఈ కుబేరులే నిదర్శనమని, ఇకనైనా వ్యాక్సిన్ టెక్నాలజీపై దిగ్గజ కార్పొరేషన్ల ఏకచత్రాదిపత్యం ఆగాలని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అప్పుడే అభివద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లపై పేటేంట్ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని అనేక మంది సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.