Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ''ఫాదర్ ఆఫ్ హైబ్రీడ్ రైస్''గా పిలుచుకునే యువాన్ లాంగ్పింగ్ శనివారం చాంగ్షాలో అస్వస్థత కారణంగా మరణించారు. ఆయన వయస్సు 91సంవత్సరాలు. చైనాలో హైబ్రీడ్ రైస్‌పై పరిశోధన, అభివృద్ధి రంగంలో యువాన్‌ను ఆద్యుడిగా భావిస్తారు. మిశ్రమ వరి వంగడాలను ఉపయోగించడంలోని ఫలితాలను పూర్తిగా, విజయ వంతంగా ఉపయోగించుకున్న ప్రపంచంలోనే తొలి తరం శాస్త్రవేత్తగా యువాన్‌ను పరిగణిస్తారు. 2019 సెప్టెంబరు 29న చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా యువాన్‌కు 'మెడల్ ఆఫ్ ది రిపబ్లిక్' అవార్డుతో సత్కరించారు. చైనా ఆహార భద్రతకు, వ్యవసాయ శాస్త్ర అభి వృద్ధికి, ప్రపంచ ఆహార సరఫరాకు ఆయన విశేషమైన సేవలందించారు. సూపర్ హైబ్రీడ్ రైస్ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ పరిశోధ నలకే తన జీవితాన్ని అంకితం చేశారు. 1949కి ముందు కాలంలో తగినంతగా తినడానికి లేక రోడ్లపై ఆకలితో బాధపడుతూ చనిపోవడాన్ని తాను చూశానని ఆ హృదయ విదారక దృశ్యాలే తనను ఇటువైపునకు నడిపించాయని యువాన్ చాలాసార్లు చెప్పారు. మొత్తం ప్రపంచంలో 9శాతం కన్నా తక్కువ విస్తీర్ణంలో ఐదో వంతు ప్రపంచ జనాభాకు అన్నం పెట్టేలా చైనా చేసిన కృషిలో యువాన్ పాత్ర ఎనలేనిది.