Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్జీర్స్: ఉత్తర ఆఫ్రీకాదేశం అయిన అల్జీరియాలో అధ్యక్షుడికి, ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని 2019 నుంచి హీరక్ ఉద్యమం సాగుతున్నది. దేశాధ్యక్షుడు అబ్దిలాజీజి 5వ సారి ఎన్నికలకు ఉపక్రమించడంపై తీవ్ర నిరసన బయలు దేరి ఉద్యమ రూపం తీసు కున్నది. ఈ ఉద్యమానికి ఏ పార్టీ నాయకత్వం వహించడం లేదు. అం దుకే హీరక్ ఉద్యమం అని అంటున్నారు.అల్జీరియా పాలనా వ్యవ స్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి నిరసనకారులు గట్టిగ పట్టు పడుతున్నారు. 2019 నుంచి ప్రతి శుక్రవారం నిరసనలు చేస్తు న్నారు. అయితే కోవిడ్-19 వలన మధ్యలో ఆపినా మల్లి మార్చి నుంచి ప్రారం భం అయినవి ఈ శుక్రవారం 118వ నిరసవారం జనం పెద్ద ఎత్తున కది లి వచ్చారు. పోలీసులు విరుచుకుబడి 800 మందిని అరెస్టు చేసి చివ రికి 40 మందిని నిర్భందంలో ఉంచుకుని మిగతవారిని వదిలి పెట్టారు.