Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : భారత్, పాక్లో వెలుగుచూస్తున్న కరోనా కొత్త వేరియంట్లు త్వరగా వ్యాప్తి చెందుతున్నందున ఈ రెండు దేశాల విమాన రాకపోకలపై కెనడా నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకు ఈ నిషేధం పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 22న 30 రోజుల పాటు నిషేధం విధించగా.. ఈ గడువు శనివారం ముగియపోనుండటంతో కెనడా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ (సిబిసి) తెలిపింది. అయితే అత్యవసర సరుకుల సంబంధించి...అంటే వ్యాక్సిన్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలకు వంటి సంబంధింత సరుకులను ఎగుమతి చేసే విమానాలు మాత్రం యథాతథంగా నడుస్తాయని తెలిపింది. విమానయాన భద్రత, ప్రజల రక్షణ మేరకు ఈ నిర్ణయం చేసినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు.