Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీఓకు 60కి పైగా దేశాల ప్రతిపాదన
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులను రద్దు చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ డిమాండ్‌ను మరింత విసతం చేస్తూ వ్యాక్సిన్లతో పాటు కరోనాపై పోరుకు అవసరమైన వైద్య పరికరాలపై కూడా మేథో సంపత్తి హక్కులను రద్దు చేయాలని దాదాపు 60కి పైగా దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వద్ద కొత్త సవరణ ప్రతిపాదన చేశాయి. కరోనా తీవ్రస్థాయిలో విజంభిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలు డబ్ల్యూటీఓ ను కోరాయి డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఎంఎస్ఎఫ్) ఛారిటీ, నాలెడ్జ్ ఎకలాజీ ఇంటర్నేషనల్(కెఇఐ)అనే ఎన్జీఓ సంస్థ వెల్లడించాయి. పేటెంట్ల హక్కుల రద్దును విసతం చేయాలని, అదేవిధంగా ధీర్ఘకాలికం చేయాలన్న సవరణ ప్రతిపాదన ఇంకా ఏం చెబుతుందన్న దాన్ని కేఈఐ ప్రచురించింది. ఈ సవరణ ప్రతిపాదనపై డబ్ల్ల్యూహెచ్‌ఓ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే పేటెంట్ల రద్దుకు సంబంధించి చర్యల్లో పాల్గొన్న పాశ్యాత్వ దేశానికి చెందిన ఒక దౌత్యవేత్త.. ఈ సవరణ ప్రతిపాదన నిజమేననీ, ఈ ప్రతాలు డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నింటీకి పంపిణీ చేయబడ్డాయని ధ్రువీకరించారు. వ్యాక్సిన్లతో పాటు కరోనాపై పోరుకు అవసరమైన నివారణ, చికిత్స, ఇతర వైద్య పరికరాలకు పేటెంట్ల హక్కును విసతం చేయాలని 60కి పైగా దేశాలు తమ ప్రతిపాదనలో కోరాయి. ఈ రద్దు అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల పాటు కొనసాగాలని, ఆ తరువాత ఎత్తేయాలా?.. కొనసాగించాలా? అనే దానిపై డబ్ల్యూటీఓ జనరల్ కౌన్సిల్ నిర్ణయిం చాలని పేర్కొంది. పేటెంట్లను రద్దు చేయడం వలన వ్యాక్సిన్లు, ఇతర వైద్య పరికరాలపై ఉన్న ఏకపక్ష అడ్డంకులు తొలగుతాయని, అది కరోనా పై పోరులో ఎంతో సహకరిస్తుందని ఎంఎస్ఎఫ్ దక్షిణాసియా చీఫ్ లీనా మంగనే ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇటువంటి మేథో సంపత్తి హక్కుల రక్షణను తొలగించాలని గతేడాది నుంచే భారత్, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాలు డబ్ల్యూటీఓ ను కోరుతున్న విషయం తెలిసిందే.