Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 మంది రన్నర్లు మృతి
బీజింగ్ : చైనాలో మారథాన్‌లో అపశృతి చోటుచేసుకుంది. పర్వత ప్రాంతాల్లో నిర్వహించిన వంద కిలోమీటర్ల రేసులో పాల్గొన్న 21 మంది రన్నర్లు చనిపోయారు. తీవ్రమైన చలిగాలులు, వర్షాల కారణంగా వీరం తా మరణించారని స్థానిక మీడియా సిసిటివి ఆదివారం తెలిపింది. శని వారం మధ్యాహ్నం వాయువ్య గన్సు ప్రావిన్స్‌లోని బైయిన్ నగరానికి సమీపంలో ఉన్న ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్‌లో ఈ మారథాన్ ప్రారంభ మైంది. ఈ రేసులో సుమారు 172 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. రేసు మొదలైన కొంత సేపటికే... ప్రతికూల వాతావరణం ఏర్పడంతో వీరి జాడ కానరాకుండా పోయింది. చిట్టచివరి పోటీదారుడు నుంచి సంకేతాలు కోల్పోవడంతో ఈ విషయాన్ని అధికారులు గుర్తించి సహా యక చర్యలు చేపట్టినట్లు సిసిటివి తెలిపింది. తప్పిపోయిన చివరి వ్యక్తిని ఆదివారం ఉదయం గుర్తించినట్లు సమాచారం. నగర మేయర్ ఝాంగ్ జుచెన్ మాట్లాడుతూ మారథాన్ ప్రారంభమయ్యాక 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందిం దని, వడగళ్ల వాన, ఈదురుగాలులతో కూడిన మంచు తుపాను ముంచె త్తడం వల్ల ఇంతటి ఘోరం జరిగిందని అన్నారు. రేసర్ల నుండి సంకే తాలు కోల్పోయిన వెంటనే రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని, ఇప్పటి వరకు 18 మందిని రక్షించామని తెలిపారు.