Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్: మయన్మార్‌కు 1948 లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేవలం 20 సంవత్సరాలే ప్రజా స్వామిక పరిపాలన సాగింది. మిగతా కాలమంతా సైనిక పాలన నియంతల పాలన కొనసాగింది. ప్రస్తుతం మళ్లీ మయన్మార్‌లో అంగ్‌సాన్ సూకీ పార్టీ అయిన ప్రజాస్వామ్య జాతీయ సంస్థ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ)ని రద్దు చేసే కుట్ర జరుగుతున్నది. 2020లో మయన్మార్‌లో జరిగిన ఎన్నికలలో ఎన్ఎల్డీ అవకతవకలకు పాల్పిడినట్టు ఆరోపణలపై ఎన్నికల కమిషన్ జరుపుతున్న విచారణ ముగింపుకు వచ్చింది. విచారణ ముగిసిన తరువాత ఎన్ఎల్డీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలా లేక చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై దేశద్రోహ నేరం కింద శిక్షించాలా అని నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారి వీడియో సందేశం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల విధానంలో సంస్కరణల ప్రతిపాదనతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్‌కు ఎన్ఎల్డీ ప్రతినిధులు హాజరు కాలేదు. మయన్మార్‌లోని సైనిక పాలకులు సైన్యంలో ప్రస్తుతం జనరల్ స్థాయి వారకి ఉన్న పదవీ విరమణ వయోపరిమితిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రస్తుతం జనరల్ మిన్ అంగ్ నిరవధికంగా కొనసాగుతారు. ఎందుకంటే ఆయన జులైలో అరవై ఐదు సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. సూకీని అదుపులో తీసుకున్నప్పటి నుంచి ఆమెపై అనేక అక్రమ కేసులు పెట్టారు. ఎన్నికల సమయంలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించారని, అనుమతి లేని వాకీ టాకీలు ఆవిడ దగ్గర ఉన్నాయని , వలస పాలన కాలంలో ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఆవిడ అతిక్రమించారని కేసులు బనాయించారు. సూకీ తన నాయకులను కలవడానికి అనుమతించడం లేదు.