Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాట్మండ్: నేపాల్ పార్లమెంట్‌ను అప్రజా స్వామికంగా, చట్ట విరుద్దంగా రద్దు చేసినందుకు అక్కడ ప్రతిపక్ష పార్టీ ఐక్యంగా ప్రతిఘటించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో మొదటి అడుగుగా ఈ అప్రజాస్వామిక చర్యను ఖండించాలని ఐదు పార్టీ ల నాయకులు సంతకం చేసిన ప్రకటనను విడుదల చేశారు. సుప్రీం కోర్టును సంప్రదించి పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరనున్నారు. ప్రకటనపై సంతకం చేసిన ఐదు పార్టీలు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ఉపేంద్రయాదవ్, రాష్ట్రీయ జనమోర్చా ఉప చైర్మన్ దుర్గా పౌడియల్. ఈ పార్లమెంట్ కాలంలో పార్లమెంట్‌ను రద్దు చేయడం ఇది రెండవ సారి. దీనికి తక్షణ కారణం ఆపదర్మ ప్రధాని ఓలీ ఆదివారం దేశఅధ్యక్షరాలు పార్లమెంట్‌ను రద్దు చేయమని కోరడం. అయితే అంతకు ముందు ఆపదర్మ ప్రధాని ఓలీ, ప్రతిపక్ష నాయకులు షేర్ బహదూర్ దుబే ఎవరికి వారు తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని అధ్యక్షురాలకు లేఖలు ఇస్తూ తమను బలపరుస్తున్న వారి పేర్ల జాబితాను సమర్పించుకున్నారు. అయితే లేఖల్లో కొన్ని పేర్లు రెండింటిలో ఉన్నందున ఏ ఒక పార్టీకి పూర్తి సంఖ్యాబలం లేనందున పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నవంబర్‌లో ఎన్నికల తేదీలను రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రకటించారు. అదే సందర్భంలో అధికార కూటమిలో యుఎంఎల్, జేఎస్పీ-ఎన్ తమ సభ్యులు ఎవరైతే ప్రతిపక్ష కూటమిని బలపరుస్తూ వారిపై చర్యలు తీసుకుంటామని అధ్యక్షురాలికి లేఖలు సమర్పించారు. ఈ పార్లమెంట్‌ను రద్దు నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. గత ఫిబ్రవరిలో రద్దును అప్పుడు సుప్రీం కోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ ఓలీ బండారీ ద్వయం ఆడుతున్న నాటకాన్ని అందరు ఖండించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.