Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేషనల్ అసెంబ్లీ చైర్మన్ వ్యాఖ్య
హనోయ్: వియత్నాం ప్రజా బలానికి స్పష్టమైన ఉదాహరణగా పార్లమెంట్ ఎన్నికలు నిలిచాయని నేషనల్ అసెంబ్లీ (ఎన్ఎ) చైర్మన్ వాంగ్ దిన్ హూ వ్యాఖ్యానించారు. 15వ జాతీ య అసెంబ్లీ (పార్లమెంటు)కు డిప్యూటీల ఎన్నిక, 2021-2026 పదవీ కాలానికి అన్ని స్థాయిల్లో పీపుల్స్ కౌన్సిళ్ళకు ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రజల సమైక్యతను, శక్తి సామర్ధ్యాలను చక్కగా తెలియజేేశాయని అన్నారు. హై పాంగ్ సిటీలో ఆదివారం తన ఓటు హక్కును విని యోగించుకున్న అనంతరరం ఆయన మీడి యాతో మాట్లాడారు. గత 75సంవత్సరాలుగా ప్రజలు, ప్రభుత్వం అప్పగించిన కర్తవ్యాలు, బాధ్యతలను వియత్నాం పార్లమెంట్ విజయ వంతంగా నిర్వర్తించింది. 13వ జాతీయ పార్టీ మహాసభలో ఆమోదించిన తీర్మానం మేరకు చట్టాల రూపకల్పనకు సంబంధించిన కార్యక లాపాల్లో, ఉన్నత పర్యవేక్షణలో నేషనల్ అసెంబ్లీ సంస్కరణలు తీసుకొస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికలు విజయవంతం కావడానికి ప్రజలు విశేషంగా కృషి చేశారని, త్వరగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్య ొదర్శి గుయోన్ ఫూ ట్రాంగ్ కూడా ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు. 2016 నుండి 2021 వరకు పెట్టుకున్న సామాజిక ఆర్థికా భివృద్ధి ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేసిందని, తదుపరి ఐదు సంవత్సరాల్లో ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోవిడ్ ప్రభావం వున్నా ఓటర్ల బాధ్యతగా వ్యవహరించారని పార్టీ చీఫ్ వ్యాఖ్యానించారు.