Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెపిడా: ఫిబ్రవరి 1 సైనిక తిరుగుబాటులో ప్రభుత్వం కూలిపోయిన మయన్మార్ నేత ఆంగ్సాన్సూకీ మొదటిసారి బహిరంగంగా కనిపించారు. సోమవారం నాడు కోర్టు విచారణకు హాజరైన ఆమె ఆరోగ్యంగానే వున్నారని, విచారణకు ముందు తన లీగల్ టీమ్‌తో అరగంట పాటు సమావేశమైనట్లు ఆమె తరపు న్యాయవాది థాయె మాంగ్ తెలిపారు. కుట్ర జరిగినప్పటి నుండి నిర్బంధంలో వున్న 4వేల మందిలో సూకీ కూడా ఒకరు. ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి వాకీటాకీ రేడియోలను అక్రమంగా కలిగివున్నారన్న ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో వుండాలని ఆమె ఆకాంక్షించారని తెలిపారు. ఆమె పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ త్వరలోనే రద్దవుతుందని వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ సూకీ, ప్రజల కోసం ఏర్పడిన పార్టీ ప్రజలున్నంత వరకు వుంటుందని అన్నారు. గత నవంబరు ఎన్నికల్లో సూకీ పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, ఆ పార్టీని సైన్యం నియమించినన ఎన్నికల కమిషన్ రద్దు చేయనున్నట్లు మీడియా తెలిపింది.