Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగులకు అందించని బ్రెజిల్
- పలువురి మృతి
మానాయుస్ : బ్రెజిల్‌లోని మానాయుస్ పట్టణానికి వెనెజులా ఆక్సిజన్‌ను ఉచితంగా పంపినా బ్రెజిల్ ఉపయోగించుకుకోలేక పోయింది. బ్రెజిల్‌లోని మితవాద ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో బాధితులకు సరైన సమయంలో అందక పలువురు ప్రాణాలు గాలిలో కలిశాయి. మామూలుగా అయితే వెనెజులా నుంచి వచ్చిన ఆక్సిజన్‌ను ఒక గంటలోపు రోగులకు విమానంలో చేర్చవచ్చును. కానీ ఒక మాజీ మంత్రి నిర్లక్ష్యంతో ఆక్సిజన్‌ను ట్రేన్ ద్వారా రవాణా చేయడం దానికి ఒక రోజు పట్టింది. దీంతో చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోయారు.