Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రారంభం
- చైనాపై ప్రశంసలు
జెనీవా : యావత్తు ప్రపంచం కరోనాతో బాధపడుతున్న వేళ వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలకు ముగింపు పలకాలని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. డబ్ల్యూహెచ్ఎ ఆన్లైన్ సమావేశం సోమవారం ప్రారంభ మైంది. జూన్ 1 వరకూ జరిగే ఈ సమావేశంలో 194 సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు వాక్సిన్ సమానత, మహమ్మారి ఒప్పందం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన అత్యున్నత నిర్ణయ సంఘం. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రపంచ ప్రతిస్పందన, సహకారం అవసరమని డబ్ల్యూ హెచ్ఓ పేర్కొంది. సమావేశ ప్రారంభ సెషన్లో డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ మాట్లాడుతూ ' ఈ సమావేశం ప్రారంభమైన ఉదయం నుంచి ఇప్పటి వరకూ వేయి మంది మరణించారు. మరో 400 మంది మరణించడానికి సిద్ధంగా ఉన్నారు' అని తెలిపారు. కరోనా సంక్షోభం ముగిసిపోలేదని మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నదనీ, ప్రతీ దేశంలోనూ సంక్రమణను నియంత్రించే వరకూ ఈ సంక్షోభం ముగిసిపోదని చెప్పారు. ఈసంక్షోభం నుంచి ప్రపంచం ఎలాంటి పాఠాలను నేర్చుకోలేదని విమర్శించారు. ఒకవైపు చైనా 2020లో వైరస్ విజృంభణను అత్యంత వేగం గా, సాధ్యమైనంత విధంగా నియంత్రించిందని ప్రశంసించారు. తీవ్రమైన కేసులను గుర్తించడంతో చైనా విశ్రమించలేదనీ, అదే సమయంలో ప్రతీ రోజూ లక్షల డోసులను ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యాక్సినే షన్ కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. మరోవైపు భారత్ వంటి దేశాలు రోజువారీ కేసులు విజృంభణతో ప్రజా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడితో కష్టాలు పడుతున్నాయనీ, అలాగే వ్యాక్సిన్ల కొరతను కూడా ఎదుర్కొంటు న్నాయని తెలిపారు. సోమవారం సమావేశంలో వివిధ దేశాల నాయకులతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ తెలిపారు.