Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబియా : కొలంబియాలో నెల రోజుల నుంచి నిర సనలు జరుగుతున్నాయి. పన్నుల భారం తగ్గించాలని, కోవిడ్-19 మహమ్మారి నివారణకు ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని, పోలీసు హింసను అరికట్టాలని కొలంబియా జాతీయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి.
అయితే, చర్చలు దాదాపు పూర్తయినా దేశాధ్యక్షుడు డ్యూక్ ఒప్పందంపై సంతకం పెట్టకుండా వాయిదా వేశారు. దీంతో సమ్మెను కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ''కట్'' సెంట్రల్ యూనియన్ ఆఫ్ కమిటీ వర్కర్స్ అధ్యక్షుడు ఫ్రానెసిస్కో ప్రకటించారు.
మెక్సికో పరాకాష్టకు రాజకీయ హింస
మెక్సికోలో జూన్ 6న పార్లమెంట్ నుంచి నగర కౌన్సిల్, సభ్యులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 88 మంది పోటీ దారులు హత్యకు గురయ్యారు. మంగళవారం సిటీజన్స్ మ్యూ మెంట్ అభ్యర్థి అల్మా బారాగనను గౌనజుటో రాష్ట్రంలో కాల్చి చంపబడ్డారు. 2021 జూన్ 6న జరిగే ఎన్నికలలో 500మంది పార్లమెంట్ సభ్యులు, 15 మంది గవర్నర్లు, 1900 మంది నగర కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు. ఇవి ఆ దేశంలో మినీ ఎన్నికలలాంటివి. అయితే, ఈ ఎన్నికల వలన దేశం లో తీవ్ర హింస చోటుచేసుకుంది. అభ్యర్థులు రక్షణ ఏర్పాటు చేయండని కోరినా అక్కడ ప్రభుత్వం పట్టించుకోని దుస్థితి కనపడుతున్నది.