Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వానికి అభిజిత్ బెనర్జీ సూచన
లండన్ : కరోనా సెకండ్‌వేవ్ కష్టకాలంలో ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఇంకా అధికంగా వెచ్చించాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ సూచించారు. కాగా, ఆరోగ్యంపై భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం దేశ జీడీపీలో దాదాపు కేవలం 1.5 శాతంగా ఉన్నది. గత నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి ఉన్నది. అయితే, ఈ మొత్తాన్ని మోడీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతానికి, 2025 నాటికి 2.5 శాతానికి పెంచాలని భావిస్తున్నది. కాగా, ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో బాండ్ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తాయన్న విషయంలో స్పష్టత లేదని అభిజిత్ బెనర్జీ చెప్పారు. అనేక దేశాలు పది రెట్లు అప్పులు తెచ్చుకుంటున్న క్రమంలో దేశ జీడీపీలో 2శాతం అదనంగా ఎందుకు ఖర్చు చేయకూడదు అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఆర్థిక లోటును పూడ్చడం కోసం భారత్ ఇప్పటి వరకూ ఎలాంటి భారీ ప్రకటనలు చేయలేదు. దేశంలో కరోనా పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆయన భావించారు. థర్డ్‌వేవ్ గురించి ప్రకటన విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉన్నదనీ, ఇలా అయితే లాక్డౌన్ బ్యాన్ తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.