Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్ అధికారి కూర్ట క్యాంబెల్ ప్రకటన
వాషింగ్టన్: రెండు దశాబ్ధాల నుంచి అమెరికా - చైనా మధ్య సంప్రదింపులు జరిగేవి. ఆ సంప్రదింపుల కాలం ముగిసిందని అమెరికాలో ఇతర దేశాలతో దౌత్య సంబంధాల అధికారి కూర్ట క్యాంబెల్ చెప్పుకొచ్చారు. భవిష్యత్లో 'పోటీతత్వం' ఉంటుందని కొత్త వ్యూహాత్మక విధానాలను పాటిస్తామని అన్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడటం మారుతున్న పరిస్థితులకు సంకేతంగా కనపడుత్నుది. ఇది కొత్త తరహా ప్రచ్చన్న యుద్ధంలా ఉన్నది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బావాజాలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఎటువంటి బేషజాలకు పోరని వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో ఏర్పడిన క్యాడ్ను చైనా విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. క్యాడ్ అనేది చైనా వ్యతిరేక కూటమని తనకు వ్యతిరేకంగా అమెరికా పని చేయడానికి క్యాడ్ ఏర్పాటు చేసిందనీ.. చెప్పడాన్ని తప్పు పట్టారు. చైనా చుట్టూ సైనిక బలగాలను ఏర్పాటు చేసి, సైనిక కార్యక్రమాలు జరుగుతుంటే చైనా విమర్శించింది. దాన్ని అమెరికా తప్పు పట్టి ఇలా వ్యూహాత్మక అంశాలపై రెచ్చగొడితే అది సైనిక పోటీతత్వం పెంచుతుందని అది ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారి తీసి శాంతికి భంగం కలుగుతుందన్నారు.